
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని చలో గన్ పార్క్ చేపట్టారు. అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు.
ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డుతోపాటు ఒక్కొక్కరికి 250 గజాల ఇంటి స్థలం కేటాంచాలని పేర్కొన్నారు.