ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి

ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి

ముషీరాబాద్, వెలుగు: ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివాసీల హక్కుల కార్పోరేటీకరణ, ఆపరేషన్​కగార్ కాల్పుల విరమణ అంశాలపై సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్య భారతదేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసమే దండకారణ్యంలోని ఆదివాసీల పక్షాన పోరాడుతున్న మావోయిస్టులను కేంద్రం అంతమొందిస్తోందని ఆరోపించారు. సంఘం ప్రధాన కార్యదర్శి కుతాడి రవికుమార్, నాయకులు వనం రమేశ్, మొగులయ్య, యాదగిరి, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.