పదేండ్ల తరువాత మెగా డీఎస్సీ వచ్చింది : శివసేనారెడ్డి

పదేండ్ల తరువాత మెగా డీఎస్సీ వచ్చింది : శివసేనారెడ్డి
  • 2 నెలల్లో 37 వేల కొలువులు ఇచ్చినం
  • యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ర్టంలోని కాంగ్రెస్ హయంలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మళ్లీ పదేండ్ల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రిలీజ్ అయిందని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనా రెడ్డి అన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గన్ పార్క్​లోని అమరవీరుల స్ధూపానికి నివాళులు అర్పించి,  పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ..నిరుద్యోగుల జీవితాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతున్నదని చెప్పారు.

 రేవంత్ సర్కార్ వచ్చిన 2 నెలల్లో 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. అమరవీరుల ఆశయ సాధనకై తమ ప్రభుత్వం నడుస్తుందని వెల్లడించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని గత బీఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని గుర్తు చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టబుడి ఉందన్నారు. ఏదాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ సర్కారు మోసం చేసిందని, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని శివసేనారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.