
పుణె: తెలంగాణ యంగ్ ఆర్చర్ తానిపర్తి చికిత ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఇండియా టీమ్‌కు ఎంపికైంది. ఆదివారం జరిగిన సెలెక్షన్ ట్రయల్స్‌లో ఫెయిలైన ఇండియా స్టార్ ఆర్చర్లు అభిషేక్ వర్మ, మూడుసార్లు ఒలింపియన్ అటాను దాస్ జట్టులో చోటు కోల్పోయారు. విమెన్స్ కాంపౌండ్ విభాగం సెలెక్షన్ ట్రయల్స్‌లో ప్రితికా ప్రదీప్, చికిత చెరో 12.25 పాయింట్లతో సమంగా నిలిచారు. దీంతో ఇద్దరి మధ్య షూటాఫ్ నిర్వహించగా ప్రితిక మూడో ప్లేస్‌లో నిలిచి వరల్డ్ చాంపియన్‌షిప్ టీమ్‌లో ప్లేస్ దక్కించుకుంది. జ్యోతి సురేఖ (18.25), ప్రణీత్ కౌర్ (14), ప్రితికాతో పాటు చికిత వరల్డ్ కప్‌లో బరిలోకి దిగనుంది. టాప్–3లో నిలిచిన షూటర్లు మాత్రం వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పోటీపడనున్నారు.ఈసారి కొత్తగా గాథా ఖడకే, శార్వరీ షెండేకు జట్టులో స్థానం లభించింది.
జట్లు
మెన్స్ రికర్వ్: బొమ్మదేవర ధీరజ్, నీరజ్ చౌహాన్, రాహుల్ సింగ్, తరుణ్‌దీప్ రాయ్, విమెన్స్: దీపికా కుమారి, అంకితా భకత్, గాథా ఖడకే, శార్వరి షెండే. మెన్స్ కాంపౌండ్: అమన్ సైనీ, ప్రథమేష్, రిషబ్ యాదవ్, ప్రియాంష్, విమెన్స్: వెన్నం జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్, ప్రితికా ప్రదీప్, తానిపర్తి చికిత.