సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కీసర, వెలుగు: సామాజిక పారిశ్రామికవేత్తలకు రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం కీసర బాల వికాస  క్యాంపస్‌‌‌‌లో సోషల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ ప్రెన్యూర్‌‌‌‌షిప్ సమ్మిట్ -ఇంపల్స్ 2024  జాతీయ సదస్సు ప్రారంభించారు. 

మంత్రి శ్రీధర్‌‌‌‌ బాబు మాట్లాడుతూ..   రాష్ట్రంలో సోషల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌‌‌కు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం త్వరలో కొత్త ఎంఎస్‌‌‌‌ఎంఈ పాలసీని తీసుకురాబోతోందన్నారు.  తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌‌‌‌ఐసీ) భాగస్వామ్యంతో బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (సీఎస్‌‌‌‌ఆర్ బీ) వార్షిక ఫ్లాగ్‌‌‌‌ షిప్ ఈవెంట్ నిర్వహించారు.