తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఫిబ్రవరి 8వ తేదీన గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 17వ తేదీన వరకు కొనసాగాయి.  ఈ సమావేశాల్లో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం.. రూ. 2.75లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

ఫిబ్రవరి 16న కుల గణనపై ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అన్నీ పార్టీల సభ్యులు మద్దతు తెలపడంతో స్పీకర్ బిల్లును ఆమెదించారు. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు.  కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా ప్రాజెక్టులపై కా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మొత్తం 8 రోజుల బడ్జెట్ సమావేశాల్లో 45 గంటల 32 నిమిషాలు సభ నడిచింది. ఈ సమావేశాల్లో 3 బిల్లులు, 2 తీర్మానాలను అసెంబ్లీ ఆమోదం తెలిపింది.