
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. 2023 నవంబర్ 30వ తేదీ పోలింగ్.. డిసెంబర్ 3వ తేదీ కౌంటింగ్ ఉండనుంది. ఎన్నికల షెడ్యూల్ రాకతో.. అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చేసింది. డిసెంబర్ 5వ తేదీ వరకు ఈ కోడ్ అమల్లో ఉండనుంది. ఈ క్రమంలోనే ప్రజలకు ముఖ్య గమనిక ఇది.. మీరు.. మీ వెంట పెద్ద మొత్తంలో నగదు అదేనండీ డబ్బు తీసుకెళుతున్నారా.. అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 50 వేల రూపాయలకు మించి.. మీరు తీసుకెళ్లే డబ్బుకు కచ్చితంగా రసీదు, ఇతర డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాలి. అలా లేని పక్షంలో.. మీరు తనిఖీల్లో దొరికినట్లయితే.. ఎన్నికల అధికారులు, పోలీసులు, ఇతర టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ డబ్బును సీజ్ చేస్తారు. ఎన్నికలు మిగిసే వరకు ఆ డబ్బును ఇవ్వరు. సరైన పత్రాలు లేకపోతే డబ్బును సీజ్ చేస్తారు కనుక.. మీ వెంట డబ్బు తీసుకెళుతున్నట్లయితే జాగ్రత్తలు తీసుకోండి.
కేవలం డబ్బు మాత్రమే కాదు.. బంగారం, వెండి వంటి ఆభరణాలను సైతం పెద్ద మొత్తంలో తీసుకెళుతున్నట్లయితే వాటికి సరైన పత్రాలు మీ వెంట తీసుకెళ్లండి. లేకపోతే తనిఖీల్లో దొరికితే సీజ్ చేసే అవకాశం ఉంది.
ఒక వేళ ఆస్పత్రి, ఇతర అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళుతున్నట్లయితే.. ఆ రోగికి సంబంధించిన ఆస్పత్రి రిపోర్టులు మీ వెంట పెట్టుకోండి. రసీదులు ఉంచుకోండి.. రోగి వివరాలకు సంబంధించిన కాపీలు పెట్టుకోండి.. లేకపోతే ఆ డబ్బును సీజ్ చేసే అవకాశం ఉంటుంది.
సో.. డిసెంబర్ 5వ తేదీ వరకు 50 వేల రూపాయలకు మించి డబ్బులు తీసుకెళుతున్నట్లయితే వాటికి సంబంధించిన అన్ని పత్రాలు మీ వెంటే తీసుకెళ్లండి.. బీ కేర్ పుల్.. బీ అలర్ట్...