
- జనగణనలో బీసీ గణనపై ప్రధానితో మాట్లాడాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది జరిగే జనగణనలో బీసీ గణనపై ప్రధానితో మాట్లాడాలని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ బీసీ నేతలు కోరారు. మంగళవారం ఉండవల్లిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ ప్రెసిడెంట్ కేసన శంకర్ రావుల ఆధ్వర్యంలో 26 బీసీ సంఘాల నేతలు చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందచేశారు.
ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ దేశవ్యాప్తంగా ఉన్న బీసీ డిమాండ్లను నెరవేర్చేలా చూడాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లు, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలే చొరవ తీసుకోవాలని కోరారు.