హిందూ సమాజానికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

హిందూ సమాజానికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి

హైదరాబాద్ : గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యలో హిందూ సమాజం ఇబ్బందులు పడుతోందన్నారు. కోవిడ్ ను అడ్డంపెట్టుకొని బోనాలు, ఉగాది, శ్రీరామ నవమి, గణేశ్ పండుగలు చేసుకోనివ్వలేదని ఆరోపించారు. ఆదివారం పాతబస్తీలో జరిగిన మొహరం ర్యాలీని ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.

గణేష్ నవరాత్రులకు లేని పర్మిషన్ మొహరంకు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. పోలీసులే దగ్గరుండి.. వేల మందితో ర్యాలీ నిర్వహించారని, హిందువులు గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క వర్గానికే కొమ్ము కాస్తోందని, ఎంఐఎం ప్రతినిధిగా హోంమంత్రి వ్యవహరిస్తున్నారని బండి‌ సంజయ్ తప్పుబట్టారు.  హిందూ సమాజానికి సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్.