
బీజేపీ నేతలు జె.సంగప్ప, రాణి రుద్రమ, చందుపట్ల కీర్తిరెడ్డి సహా పలువురు నేతలను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లాకు పార్టీ నూతన అధ్యక్షుడిగా సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ ను నియమించారు. అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేబీ పౌడెల్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మార్చారు.
రాష్ట్ర అధికార ప్రతినిధులు వీరే
ఎన్ వీ సుభాష్, తుళ్ల వీరేందర్ గౌడ్, జె.సంగప్ప, చందుపట్ల కీర్తి రెడ్డి, పోరెడ్డి కిషోర్, రాణి రుద్రమ