మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 27 నుంచి పునఃప్రారంభమిస్తామని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తెలిపింది.  ఈ విషయాన్ని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. 

కరోనా వ్యాధి వల్ల రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగిపోయాయని, దీని వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారన్నారు. అయితే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా  అన్ని దేశాలు వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం వల్ల కరోనా తగ్గుముఖం పట్టిందని, ఈ నేపథ్యంలోనే సంబంధిత విమాన సంస్థల యాజమాన్యాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మార్చి 26 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసలపై నిషేధం కొనసాగుతుందని, మార్చి 27 నుంచి అన్ని రకాల అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విమానాల రాకపోకలు జరుగుతాయని విమానయాన శాఖ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

19 గిరిజన భాషలకు లిపి రూపొందించిన ప్రసన్న శ్రీ

సస్పెన్షన్పై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యేలు