ఓటును అమ్ముకుంటే.. మీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నట్లే.. తెలంగాణ బ్లాక్ వాయిస్

ఓటును అమ్ముకుంటే.. మీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నట్లే.. తెలంగాణ బ్లాక్ వాయిస్

ఓటును అమ్ముకోవద్దని.. ఓటును అమ్ముకొని బానిసలవ్వద్దని ప్రజలకు తెలంగాణ బ్లాక్ వాయిస్ అవగాహన సదస్సును నిర్వహిస్తుంది. ఓటును అమ్ముకుంటే మీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నట్లే.. ఓటేసి రాజులవుతారో, అమ్ముకొని బానిసలవుతారో మీరే నిర్ణయించుకోవాలని తెలంగాణ బ్లాక్ వాయిస్ ఆధ్వర్యంలో అవేర్నెస్ క్యాంపెన్ ను ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా మై వోట్ నాట్ ఫర్ సేల్ నినాదాలతో అంబెడ్కర్ కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనే నినాదంతో.. వాలంటీర్స్ కి టీషీర్ట్స్ పంపిణీ చేసి.. మహబూబ్ నగర్ జిల్లా మాడ్గుల పరిసర ప్రాంతాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. 

టీషీర్ట్స్ పై ఏముందంటే..

ఓటేసి రాజులవుతారో.. అమ్ముకొని బానిసలవుతారో మీరే నిర్ణయించుకోండి
ఓటును అమ్ముకుంటే మీ బిడ్డల భవషత్తు అమ్ముకున్నట్లే
My Vote is not for Sale

వాలంటీర్స్ ఈ బ్లాక్ టీషీర్ట్స్ వేసుకొని గ్రామ గ్రామాన తిరుగుతూ.. ఓటర్లకు ఓటును నోటుకు అమ్ముకోవద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఓటు విలువను అందరికీ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా ఉపయోగించుకొని ఈ ఓటర్ అవర్నెస్  ప్రోగ్రాం మరింత ముందుకు తీసుకెళ్లాలని అధ్యక్షుడు గోవిందు శ్రీధర్ అన్నారు. అంబెడ్కర్ కల్పించిన ఓటుహక్కును అందరు సద్వినియోగం చేసుకొని.. సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ASO రాములు తెలిపారు.

ALSO READ : ఇండియా బిగ్గెస్ట్ డేటా లీక్ : 81 కోట్ల మంది ఆరోగ్యం వివరాలు అమ్మకం..?