ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం..

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం..

హైదరాబాద్‌:  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్‌. అసెంబ్లీలో  వార్షిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024- 25 ను ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీ శనివారం  రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించి.. బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థకశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  బడ్జెట్ లో అన్ని అంశాలు ఉంటాయని చెప్పారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఆస్తులు.. అప్పులతో పాటు కేంద్రం నుండి వచ్చే ఆదాయంపైనా బడ్జెట్‌ ప్రసంగంలో ఉంటాయని ఆయన చెప్పారు.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓటాన్ అకౌంట్ బడ్జెట్–2024–25ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ. 2.95 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లలోపు అంచనాలతో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిసింది. ప్రధానంగా ఆరు గ్యారంటీలకు రూ.70 వేల కోట్లు కేటాయించేలా అంచనాలు రెడీ చేశారు. మొత్తం మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను పెట్టనున్నారు.