
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీకి కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సహా పెన్షనర్లందరికీ 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు ఆమోదముద్ర వేసింది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. 9,21,037 మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. 2018 జూన్ ఒకటో తేదీ నుంచి నోషనల్ బెనిఫిట్, 2020 ఏప్రిల్ ఒకటి నుంచి మానిటరీ బెనిఫిట్, ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్యాష్ బెనిఫిట్ వర్తింపజేస్తుంది. పెన్షనర్లకు 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మే నెలాఖరు వరకు పీఆర్సీ ఎరియర్స్ 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. హెచ్‌ఆర్‌ఏపై పరిమితిని తొలగించాలని నిర్ణయించారు.