హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్‌లో ఈ నెల 18న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. మెట్రో టేకోవర్‍పై సందిగ్ధత ఏర్పడడంతో ఇప్పుడేం చేయాలి అనేదాని మీద, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
త్వరలో జీహెచ్ఎంసీ , ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో ఈ అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రాష్ట్రంలో ఇకపై ‘ఈ–కేబినెట్’ మీటింగ్స్ నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. పరిపాలనలో పేపర్‌లెస్ విధానం తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు.
