16న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్ల కోటాపై చర్చ..

16న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్ల కోటాపై చర్చ..

గురువారం ( అక్టోబర్ 16 ) తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ క్యాబినెట్ భేటీలో కీలకం అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోటా అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు స్టే, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై చర్చించనుంది మంత్రివర్గం. పంచాయితీ ఎన్నికలు, జీవో 9పై హైకోర్టు స్టే విధించిన క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల  కోటాపై సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది.

దీంతో పాటు రాష్ట్రంలో వరి, పత్తి కొనుగోలు సెంటర్లకు సంబంధించిన అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న రెండో ఉపఎన్నిక కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మత్తులకు నిధుల కేటాయింపులు వంటి కీలక అంశాలు క్యాబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.