
రేపు(జులై 31) తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే మీటింగ్ లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో వరదలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేబినెట్ సమీక్ష చేయనుంది. అకాల వర్షాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలపై మంత్రులు చర్చించనున్నారని ప్రభుత్వం తెలిపింది. వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని కేబినెట్ అంచనా వేయనుందని ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందును వీటిపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనుంది.