
తమిళనాడు సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రెండ్రోజుల టూర్ లో భాగంగా ఇవాళ స్టాలిన్ తో భేటీ అయ్యారు. స్టాలిన్ సీఎం అయ్యాక ఫస్ట్ టైం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కేసీఆర్. యాదాద్రి టెంపుల్ ఓపెనింగ్ కు స్టాలిన్ ను ఆహ్వానించనున్నారు. మాజీ గవర్నర్ నరసింహన్ ను కూడా కేసీఆర్ కలుస్తారని సమాచారం. నిన్న శ్రీరంగంలో రంగనాథస్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు కేసీఆర్.