
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది తెలంగాణ సీఐడీ. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఆరు బృందలతో రంగంలోకి దిగిన సీఐడీ 8 మంది ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి డేటాతో పాటు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. అరెస్ట్ అయినవారిలో తాజ్ 0077, Fairplay.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 బెట్టింగ్స్ యాప్స్ సంస్థల నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం.
ఈ యాప్ నిర్వాహకులు ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు సీఐడీ గుర్తించింది. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులన్నింటినీ ప్రభుత్వం సీఐడీ చేతికి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసు టేకప్ చేసిన సీఐడీ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ఆపరేటర్లు ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నట్లు గుర్తించి దర్యాప్తులో వేగంగా పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన సీఐడీ.. తాజా ఆపరేషన్‌లో మరో 8 మందిని అరెస్ట్ చేసింది.
ALSO READ :కుక్క కరిచింది.. చిన్న గాయమే అని ట్రీట్మెంట్ తీసుకోలేదు..
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహిస్తూ ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై, బెట్టింగ్ యాప్ ఆపరేటర్లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్ల వరకు పోలీసులు కేసులు ఫైల్ చేశారు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్హసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు శేషయాని సుప్రితపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది.