
- కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ వద్దకు ఫైల్
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) ని సవరించేందుకు ఇటీవల కేబినెట్ నిర్ణయించింది.
ఇందుకు సంబంధించిన ఫైల్ పై తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క, ఆ వెంటనే సీఎం సంతకం చేశారు. ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో ఫైల్‌ను ఆమోదించిన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీచేయనున్నట్లు చెబుతున్నారు.