రాష్ట్రమంతా లాక్ డౌన్: అందుబాటులో ఉండే సర్వీసుల వివరాలు..

రాష్ట్రమంతా లాక్ డౌన్: అందుబాటులో ఉండే సర్వీసుల వివరాలు..

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం రాష్ట్రమంతా లాక్ డౌన్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించినట్లుగానే క్రమశిక్షణతో ఈ నెల 31 వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్‌కు సహకరించాలని కోరారు. ఎసెన్షియల్ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆయన ప్రకటించారు. సరుకుల కోసం ఇంటికి ఒకరు మాత్రమే బయటకు రావాలని చెప్పారు. పేదవాళ్లు ఇబ్బంది పడకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి రూ.1500 ఆర్థిక సాయంతో పాటు ఇంట్లో మనిషికి 12 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.

అందుబాటులో ఉండే సర్వీసులు

– నిత్యావసర సరుకులు, కిరాణా స్టోర్స్
– పండ్లు, కూరగాయలు
– ఆహారానికి సంబంధించిన అన్ని సేల్స్
– పెట్రోల్/సీఎన్‌జీ బంకులు
– రైస్ సేల్స్
– పాలు, డెయిరీ యూనిట్స్
– వంట గ్యాస్ సప్లై
– మెడిసిన్స్, ఫార్మా స్టోర్స్
– హెల్త్ సర్వీసులు
– మెడికల్, హెల్త్ ఎక్యూప్‌మెంట్ తయారీ యూనిట్స్
– టెలికాం సేవలు, వాటి నిర్వహణలో సమస్య లేకుండా చూసే ఏజెన్సీలు
– ఇన్సూరెన్స్ కంపెనీలు
– బ్యాంకులు, ఏటీఎంలు
– పోస్ట్ ఆఫీసులు
– గోధుమలు, బియ్యం సరఫరా చేసే గోడౌన్లు
– నిత్యావసరాల ట్రాన్స్‌పోర్టేషన్