రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. నైట్ కర్ఫ్యూ విధిస్తారా ?

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. నైట్ కర్ఫ్యూ విధిస్తారా ?

సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైరస్ నియంత్రణపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించారు. ఇవాళ్టితో సంక్రాంతి సెలవులు అయిపోతున్నాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సెలవులను ఈనెల 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. 

సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కూడా కూడా కరోనా పరిస్థితులపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది.  కరోనా కట్టడికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. పక్కనున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఏపీ సర్కార్ కూడా 18వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. అయితే పండుగల తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. పండుగలకు పట్నం నుంచి ఊర్లకు వెళ్లిన జనం.. తిరుగు ప్రయాణమవుతున్నారు. దాంతో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి తీసుకునే చర్యలపై కేబినెట్ లో డిస్కస్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి: 

ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. పండుగ సరదా

కొవిడ్ ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు