
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులతో పాటు ఏఐసీసీ పెద్దలను కలుస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు సీఎం రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చించారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు ఎంపీలు మల్లు రవి, సురేష్ కుమార్ షెట్కర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి, పొంగులేటి భేటి
మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రిగా పదవీ చేపట్టిన సందర్భంగా పార్టీలకు అతీతంగా కలిసి సత్కరించడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరగా.. ఎలాంటి సహయ సహకారాలు కావాలన్నా అందుబాటులో ఉండి చేస్తానని కిషన్ రెడ్డి మాటిచ్చారని తెలిపారు.