పల్నాడులోని వరికెపూడిశెల లిఫ్ట్ పనులు ఆపండి : తెలంగాణ కంప్లయింట్

పల్నాడులోని వరికెపూడిశెల లిఫ్ట్ పనులు ఆపండి : తెలంగాణ కంప్లయింట్
  • కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న వరికెపూడిశెల లిఫ్ట్​ఇరిగేషన్​ స్కీమ్ పనులను ఆపాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. గురువారం కేఆర్ఎంబీ చైర్మన్​శివ్​ నందన్​ కుమార్​కు ఇరిగేషన్​ ఈఎన్సీ మురళీధర్​ లేఖ రాశారు. పల్నాడు జిల్లా మాచర్లలో లిఫ్ట్​స్కీం నిర్మాణానికి ఈ నెల 15న శంకుస్థాపన చేశారని ఈఎన్సీ తన లెటర్లో వెల్లడించారు.

ALSO READ : ఇంటి వద్దే ఓటేసిన వృద్ధులు, దివ్యాంగులు 

ఈ ప్రాజెక్టు ఫేజ్​–1 పనులను రూ.340.26 కోట్లతో, రెండో దశ రూ.3,809  కోట్లతో చేపట్టనున్నట్లు చెప్పారు. రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీల నీటిని తరలించేలా లిఫ్ట్​ స్కీమ్ చేపడుతున్నారని వివరించారు. అపెక్స్​ కౌన్సిల్ సహా ఎలాంటి అనుమతులు లేకుండా  ఈ ప్రా జెక్ట్ కడుతున్నారని ఆరోపించారు.