నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం.. మీనాక్షి నటరాజన్

నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం.. మీనాక్షి నటరాజన్

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ బ్రహ్మచారిణి. చాలా సాదా సీదాగా ఉంటారు. అత్యవసర మీటింగులకు, రాహుల్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అత్యవసర పిలుపు వస్తే మినహా ఆమె ఫ్లైట్ జర్నీ చేయరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఇడ్లీయే ఆమె బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని తెలుస్తోంది. కేవలం  రెండు జతల బట్టలే వాడుతారని అంటున్నారు. స్వాగతాలు, సన్మానాలు, బొకేలకు చాలా దూరంగా ఉంటారు.  

శనివారం మౌన వ్రతం  పాటిస్తారు. గాంధేయ సిద్ధాంతంలో భాగం. ఆ రోజు ఎవరితో మాట్లాడరని, కేవలం సంజ్ఞలతోనే నడిపిస్తారని అంటున్నారు. కాన్వాయ్ ప్రయాణానికి దూరం సాధారణంగా ఆమె ఆటోలో వెళ్లేందుకు ప్రయార్టీ ఇస్తారు. ఎక్కడైనా రాత్రి బస చేయాల్సి వస్తే సొంత ఖర్చులతో మాజీ ఎంపీ హోదాలో ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటారు.

Also Read:-దేశ రక్షణ అందరి బాధ్యత:సీఎం రేవంత్రెడ్డి

 ఈ నేపథ్యంలో ఇవ్వాళ రాత్రి కూడా దిల్ కుశా గెస్ట్ హౌస్ లో ఆమె బస చేయనున్నారు. ఇందుకోసం ఆమె నేరుగా ఆన్ లైన్ లోనే రూ. 50 చెల్లించి ఓ గదిని బుక్ చేసుకున్నారు. గ్రూప్ మీటింగులు తప్ప పర్సనల్ మీటింగ్స్ కు దూరం. సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు.