
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణలో రాజకీయాలు, పార్టీ పరిస్థితిని వివరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ చెప్పారు. సీనియర్లలో అసంతృప్తి లేదని తెలిపారు. తాను 1989 లోనే మంత్రిగా పనిచేశానని..తనకంటే సీనియర్ పార్టీలో ఎవరూ లేరన్నారు.
టీ- కాంగ్రెస్ నేతల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఖర్గేకు వివరించారు. అందుకు కారణమైన పరిస్థితులపై పార్టీ అధినేతకు వివరించామని తెలిపారు. ఒకనాటి హైదరాబాద్ రాష్ట్రం ప్రాంతానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మాకంటే ఎక్కువ ఆయనకే అవగాహన ఉందన్నారు. పార్టీ ఐక్యత కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న అంశాలపై చర్చించామన్నారు. నాయకత్వం ఏదైనా మాట్లాడితే అందరూ ఐకమత్యంతో అదే మాట మీద ఉండాలన్నారు. నేతలంతా ఐక్యంగా ఉంటే కాంగ్రెస్ కు మళ్లీ పూర్వవైభవం వస్తుందన్నారు.