
అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి నలుగురు విప్ లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, దోర్నాకల్ రాంచెంద్రనాయక్ లకు అవకాశం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవటం.. ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వటం.. కౌంటర్ ఇచ్చే విధంగా పార్టీ ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయనున్నారు ఈ విప్ లు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటం.. గవర్నర్ సందేశానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా పలువురు సభ్యులు ప్రసంగించనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల బలం కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉండటంతో.. ఈ విప్ ల బాధ్యత మరింత పెరిగింది.