ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా గ్యాప్ లేకుండా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది. సౌతాఫ్రికా మూడు ఫార్మాట్ లు ఆడడానికి ఇండియాలో పర్యటిస్తుంది. ఈ సుదీర్ఘ టూర్ లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో భాగంగా మొదట టెస్ట్ సిరీస్ జరగనుంది. శుభమాన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టు సోమవారం (నవంబర్ 10) కోల్‌కతాకు చేరుకుంది. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియాతో చివరి టీ20 ముగించుకున్న టీమిండియా బ్రిస్బేన్ నుంచి నేరుగా కోల్‌కతా చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ జట్టులో భాగమైన టీమిండియా ప్లేయర్స్ శుభమాన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరందరూ ఆదివారం (నవంబర్ 9) సాయంత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. నవంబర్ 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ జరుగుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఇరు జట్ల స్క్వాడ్ లను ప్రకటించారు.
శుభమాన్ గిల్ కు నో రెస్ట్:
టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ బిజీ ప్లేయర్ గా మారుతున్నాడు. ఈ ఏడాది టీమిండియా టెస్ట్, వన్డే పగ్గాలు గిల్ కు అప్పగించిన బీసీసీఐ.. ఈ యువ బ్యాటర్ కు పెద్ద బాధ్యతను అప్పజెప్పింది. మూడు ఫార్మాట్ లు ఆడాల్సి రావడంతో గిల్ కు కష్టంగా మారుతుంది. రెస్ట్ లేకుండానే మూడు ఫార్మాట్ లు ఆడుతున్నాడు. ఆసియా కప్ ఫైనల్ ఆడిన గిల్ రెండు రోజుల గ్యాప్ ఆ మరుసటి రోజే స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కోసం ఇండియాకు వచ్చాడు. మంగళవారం (అక్టోబర్ 14) వెస్టిండీస్ తో టీమిండియా టెస్ట్ మ్యాచ్ గెలిచింది.
ఆ తర్వాత గ్యాప్ లేకుండా ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్ కోసం బుధవారం (అక్టోబర్ 15) ఆస్ట్రేలియా పయనం అయింది. ఆస్ట్రేలియాతో చివరి టీ20 ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం నేరుగా కోల్‌కతా చేరుకున్నాడు. రెండు నెలలుగా గిల్ ఇంటి ముఖం కూడా చూడలేదంటే ఎంత బిజీ ప్లేయర్ అనే విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. గిల్ కెప్టెన్ కావడంతో మూడు ఫార్మాట్ లు ఆడాల్సిందే. అన్ని ఫార్మాట్ లు ఆడడం గిల్ కు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. వన్డే, టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ చేస్తున్న గిల్.. టీ20ల్లో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Team India lands in the City of Joy!#MenInBlue are all set for the 1st Test against South Africa, starting November 14 in Kolkata.#TeamIndia #INDvSA #TestCricket #Kolkata #CityOfJoy #Cricket @BCCI @ICC pic.twitter.com/WNKLSb32WH
— Doordarshan Sports (@ddsportschannel) November 10, 2025
