
ఢిల్లీలోని వార్ రూమ్‌లో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై చర్చిస్తున్న కమిటీ అనంతం.. లిస్టును ఏఐసీసీ ఎన్నికల కమిటీకి పంపనుంది. మంగళవారం లేదా బుధవారం ఏఐసీసీ ఎన్నికల కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీ లోపు అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్సుంది. మొదటి విడతలో దాదాపు 60 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.