కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్​ చేయాలె

కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్​ చేయాలె
  • మంత్రులు హరీశ్‌‌‌‌‌‌‌‌​, శ్రీనివాస్​గౌడ్‌‌‌‌‌‌‌‌కు టిప్స్ వినతి

హైదరాబాద్,వెలుగు: కాంట్రాక్టు లెక్చరర్లు, ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌ను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేయాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి(టిప్స్), కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయా సంఘాల స్టేట్‌‌‌‌‌‌‌‌ లీడర్లు మంత్రులు హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందించారు. రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్లు, ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌కు అడ్డుగా ఉన్న పిల్‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు కొట్టేసిందని ఆయా సంఘాల నేతలు తెలిపారు. ప్రస్తుతం కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలకేషన్ కొనసాగుతున్నందున కాంట్రాక్టు లెక్చరర్లను కూడా వారి సొంత జిల్లాలకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయ్యేందుకు అవకాశమివ్వాలని కోరారు.