
కెనడాలో జరిగిన వరల్డ్ గేమ్స్లో తెలంగాణ పోలీసులు పతకాలు సాధించడం పోలీసులకు గర్వకారణమన్నారు డీజీపీ అంజన్ కుమార్ యాదవ్. రాచకొండ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, రోడ్ సేఫ్టీ వింగ్, బి శ్రీబాల.. కెనడాలోని విన్నిపెగ్‌లో జూలై 28 నుండి ఆగస్టు 6, 2023 వరకు జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ - 2023లో బ్యాడ్మింటన్ , టేబుల్ టెన్నిస్‌లో పతకాలు గెలుచుకున్నారు . ఈ సందర్భంగా అంజనీ కుమార్ శ్రీబాలను సత్కరించారు. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో పాల్గొన్న ఏకైక తెలంగాణ పోలీసు క్రీడాకారిణి ఆమె అని ప్రశంసించారు. వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ ఏడీజీపీ అభిలాషా బిష్త్ ఐపీఎస్, లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఐపీఎస్ కూడా శ్రీబాలకు అభినందనలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 70 కంటే ఎక్కువ దేశాల నుంచి 8,000 మంది పోలీసు, ఫైర్ అథ్లెట్లు 60 కంటే ఎక్కువ క్రీడలలో పోటీ పడ్డారు. టేబుల్ టెన్నిస్‌లో బి శ్రీబాల 40+ మహిళల డబుల్స్‌లో రజత పతకాలు, 40+ మిక్స్‌డ్ డబుల్స్‌లో, 40+ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాలను గెలుచుకుంది.
బ్యాడ్మింటన్‌లో, ఆమె మహిళల సింగిల్స్ 40+లో గోల్డ్ మెడల్, 40+ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మొత్తంగా, ఆమె భారతదేశానికి ఒక గోల్డ్, రెండు సిల్వర్ , కాంస్య పతకాలతో సహా ఐదు పతకాలను గెలుచుకుంది. 2022 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్, రోటర్‌డామ్‌లో, ఆమె టేబుల్ టెన్నిస్‌లోశ్రీ బాల సిల్వర్ , కాంస్య పతకాలను గెలుచుకుంది.