తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రోజూ క్రమంగా కొత్త కేసుల నమోదు తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 56,487 మందికి టెస్టులు చేయగా.. 733 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే ఇవాళ 2,850 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఒకరు ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,82,336కు చేరింది. ఇప్పటి వరకు 7 లక్షల 62 వేల 594 మంది రికవరీ అయ్యారు. మొత్తం డెత్స్ సంఖ్య 4,106కు చేరింది. ఈ వివరాలను తెలంగాణ ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.48 శాతం, డెత్ రేటు 0.52 శాతంగా ఉందని తెలిపింది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 185 మంది కరోనా బారినపడ్డారు. నల్గొండలో 47 మందికి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 44 మందికి, రంగారెడ్డి జిల్లాలో 43 మందికి, ఖమ్మం జిల్లాలో 41 మందికి కరోనా సోకింది.

మరిన్ని వార్తల కోసం..

ఎన్నికల అఫిడవిట్లో తప్పులు.. మంత్రికి జైలు శిక్ష

కశ్మీర్లో టెర్రర్ అటాక్.. ఒక పోలీస్ మృతి

అధికారంలోకి వచ్చాక 2 కోట్ల మంది యువతకు స్మార్ట్ ఫోన్లు