తెలంగాణ రౌండప్ : 2019 లో జరిగిన కీలక సంఘటనలు

తెలంగాణ రౌండప్ : 2019 లో జరిగిన కీలక సంఘటనలు

GHMC 

రూ. 30 కోట్లతో 15 ప్రాంతాల్లో చేప‌ట్టిన ఫంక్షన్‌ హాళ్లలో తొమ్మిది పూర్తయ్యాయి.
రూ. 19.37 కోట్లతో 38 చోట్ల మోడ‌ల్ మార్కెట్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 35 మార్కెట్ల నిర్మాణం పూర్తి అయ్యింది.
800 కి.మీ పొడ‌వున ఫుట్‌పాత్‌ల‌ అభివృద్ధి, 66 పార్కుల్లో ఓపెన్ జిమ్‌ల‌ ఏర్పాటు
ఎస్‌ఆర్‌డీపీలో చేప‌ట్టిన నాలుగు ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌పాస్‌లు ప్రజ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. రూ. 42.74కోట్లతో ఎల్బీన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌, రూ. 97.94 కోట్లతో రాజీవ్‌గాంధీ విగ్రహం వ‌ద్ద ఫ్లైఓవ‌ర్‌, రూ. 69.47 కోట్లతో బ‌యోడైవ‌ర్సిటీ ఫ్లైఓవ‌ర్లు పూర్తి అయ్యాయి.
రూ. 5.27 కోట్లతో నాచారం, కూక‌ట్‌ప‌ల్లిలో ఆధునిక పద్ధతిలో ఫిష్ మార్కెట్ల నిర్మాణం.
రూ. 8,598 కోట్లతో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల లక్ష్యం కాగా, 8,620 ఇళ్లు పూర్తయ్యాయి.

జనవరి 9 : ఆన్ లైన్ మల్టీలెవల్ మార్కెటింగ్ తో దేశవ్యాప్తంగా స్కామ్​కు పాల్పడ్డ ‘క్యూనెట్’​ నిందితులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.

జనవరి 30: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో జరిగే నుమాయిష్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపులన్నీ కాలి బూడిదయ్యాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులను ఈ ప్రమాదం రోడ్డున పడేసింది.

ప్లాట్ల ఈ‑వేలంతో రూ.677కోట్లు

ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఈ–వేలంతో  రూ. 1000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని హెచ్ఎండీఏ భావించింది. పెండింగ్ బిల్లుల వసూళ్లు, అక్రమ నల్లాల నియంత్రణకోసం వీడీఎస్, ఇంటింటి సర్వే వంటి యాక్షన్ ప్లాన్లను వాటర్​ బోర్డ్​ అమలు చేసింది.

ఏప్రిల్ 8, 9 : ఉప్పల్ భగాయత్ ప్లాట్లను ఈ–వేలం వేసిన హెచ్ఎండీఏ. ఇందులో 67 ప్లాట్లకు రూ.677 కోట్ల ఆదాయం వచ్చింది.

ఏప్రిల్ 29 : అక్రమ వెంచర్లపై హెచ్ఎండీఏ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేలా 15 రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్​లో దాదాపు 990 అక్రమ లే అవుట్లు గుర్తించారు.

అక్టోబర్ 11 : తొలి లాజిస్టిక్ పార్కును హెచ్ఎండీఏ ప్రారంభించింది. బాటసింగారం, మంగళ్ పల్లి వద్ద రెండు పార్కులను రూ. 60 కోట్లతో ఏర్పాటు చేసింది.

ఆగస్టు 29 : సంజీవయ్య పార్కును పిల్లల కోసమే కేటాయిస్తూ హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలుగా మారుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ పార్కును పిల్లల పార్కుగా మార్చారు.

డిసెంబర్ 14, 15, 16 : ఉప్పల్ భగాయత్ రెండో దశ వేలాన్ని హెచ్ఎండీఏ నిర్వహించింది. 127 ప్లాట్లను వేలం వేయగా.. 102 ప్లాట్లు విక్రయించి రూ.365 కోట్లు ఆర్జించింది.

ఏప్రిల్ 13 : తాగునీటి ఇబ్బందులతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. వాటర్ బోర్డు సప్లయ్ చేసే నీరు సరిపోక జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఏప్రిల్ 29 : నీటి వృథా, తాగునీటి రక్షణలో సిటీ జనాలను భాగస్వామ్యం చేసేలా వాటర్ బోర్డు హైటెక్ సిటీలోని ఫోనిక్స్ ఎరినా వద్ద వాటర్ లీడర్ కన్జర్వేషన్ సమావేశాన్ని నిర్వహించింది.

జూన్ 10 : సిటీలో నీటి ఎద్దడి కారణంగా సాగర్ జలాశయం నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ప్రక్రియ ప్రారంభించారు. వారంలో మూడు రోజులకోసారి నల్లా నీళ్లు సరఫరా అవుతుండగా, సాగర్ జలాశయం అడుగంటడంతో ఈ ప్రక్రియ చేపట్టారు.

ఆగస్టు 18 : నగరంలో అక్రమ నల్లా కనెక్షన్లు, నీటి వినియోగం, వృథా నీటి నియంత్రణపై పక్కా సమాచారం సేకరించేలా జలమండలి ఇంటింటి సర్వే ప్రారంభించింది.

నవంబర్ 22 : వలంటీర్ డిజ్ క్లోజర్ స్కీంను జలమండలి తీసుకువచ్చింది. దీని ద్వారా అక్రమ నల్లా కనెక్షన్లను రెగ్యులరైజ్ చేసుకునే వీలుకల్పించింది.

డిసెంబర్ 11 : ఇంటర్నేషనల్​ ఎయిర్ పోర్టుల జాబితాలో శంషాబాద్ ఎయిర్ పోర్టు ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఫిబ్రవరి 5: చిగురుపాటి జయరాం కేసులో ముగ్గురు పోలీసులపై వేటు.

ఫిబ్రవరి 6: బర్కత్ పురాలో ప్రేమోన్మాది దాడి. కొబ్బరి బోండాల కత్తితో దాడిచేయగా తీవ్రంగా గాయపడ్డ మైనర్ బాలిక.

ఫిబ్రవరి 13: మావోయిస్టు దంపతులు సత్వాజి, అరుణ లొంగుబాటు. మీడియా ముందు హాజరుపరిచిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి.

మార్చి 2: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐటీ గ్రిడ్’ నిందితులపై కేసు నమోదు.

మార్చి 3: లక్డీకాపూల్ ‘విమెన్ సేఫ్టీ వింగ్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ, అప్పటి ఎంపీ కవిత.

విషాదం మిగిల్చిన ఇంటర్‍ ఫలితాలు

గత ఏడాది ఇంటర్‍ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో 24 మంది స్టూడెంట్స్​ ఆత్మహత్య చేసుకున్నారు. ఫలితాలు తారుమారు కావడం వివాదాస్పదమైంది. ఇంటర్‍ బోర్డు తీరుపై బాధితుల ఆందోళనలతో హై కోర్టు జోక్యం చేసుకుంది. ప్రభుత్వం ఫ్రీగా రీవాల్యుయేషన్‍, రీ కౌంటింగ్‍ చేస్తామని ప్రకటించింది. తర్వాత దాదాపు1100 మంది పాస్‍ అయ్యారు. బోర్డు కమిషనర్‍ అశోక్​ స్థానంలో ఉమర్​ జలీల్‍ను నియమించారు. సాఫ్ట్ వేర్‍ సేవలందిస్తున్న గ్లోబల్‍ సంస్థను పక్కన పెట్టి గుడ్‍ గవర్నెన్స్ సంస్థకు రిజల్ట్ ప్రాసెస్‍ చేసే బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది.

ఏప్రిల్ 1: ఇంటర్​నేషనల్​ కిడ్నీ రాకెట్ ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.

ఏప్రిల్ 20: మైలార్ దేవ్ పల్లిలో ఎన్ఐఏ తనిఖీలు. నలుగురు ఐసిస్ సానుభూతి పరుల అరెస్ట్.

ఏప్రిల్ 25:– బొమ్మల రామారం హాజీపూర్ లో వెలుగు చూసిన  సైకో శ్రీనివాస్ రెడ్డి దారుణాలు.

ఏప్రిల్ 30:- సైకో శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్.

మే7: వనస్థలిపురంలోని ఏటీఎం నుంచి రూ.58.97లక్షల క్యాష్ చోరీ.

జూన్ 26: పంజాగుట్టలో కలకలం రేపిన ఆటో డ్రైవర్ హత్య.

జూలై4:- ఓఆర్ఆర్ పై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న  యువకుడు ఫైజాన్ అహ్మద్. జూలై 6:– పంజాగుట్టలో వ్యాపారి రాంప్రసాద్ దారుణ హత్య.

జూలై 23: హయత్ నగర్ లో బీ ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్.

ఆగస్ట్ 24: ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

కొత్త టీచర్లు వచ్చారు

2017లో టీఆర్టీ నియామకాలకు నోటిఫికేషన్‍ జారీ చేయగా.. ఆ నియామకాలు 2019లో జరిగాయి. ఇందులో కొన్ని కేటగిరీల్లో నియామకాలు ఇంకా పెండింగ్‍లోనే ఉన్నాయి. టీఆర్టీ నియామకాల కోసం అభ్యర్థులు చేసిన పోరాటాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆగస్టు, సెప్టెంబర్‍లలో ఎస్జీటీ, స్కూల్‍ అసిస్టెంట్‍ పోస్టులను దశలవారీగా నియామకాలను చేపట్టారు.

ఇన్​చార్జిలతోనే వర్సిటీలు

ఆరు నెలలుగా గ్రేటర్‍లోని పలు వర్సిటీలు ఇన్​చార్జి వీసీలతోనే నడుస్తున్నాయి. ఆయా వర్సిటీల్లో పాలక మండళ్లు కూడా లేవు. ఫ్యాకల్టీ నియామకాలు లేక యూజీసీ నిధులు రావడం నిలిచిపోయింది. పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులు ఆగిపోయాయి. ఓయూలో శాతాబ్ది ఉత్సవాలు, ఇంటర్నేషనల్‍ హిస్టరీ కాంగ్రెస్‍, ఇంటర్నేషనల్‍ సివిల్‍ ఇంజినీరింగ్‍ కాన్ఫరెన్స్ లను సక్సెస్‍పుల్‍గా నిర్వహించారు.

సెప్టెంబర్ 16: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సూసైడ్​. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కోడెల.

సెప్టెంబర్ 27:- ఈఎస్ఐ మెడికల్ స్కామ్ కేసులో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా ఆరుగురు అరెస్ట్.

అక్టోబర్ 23: సినీ నిర్మాత బండ్ల గణేశ్​ను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు.

అక్టోబర్ 25: హయత్ నగర్ లో వరుస చోరీలు చేసి భయాందోళనలు సృష్టించిన చెడ్డీగ్యాంగ్.

నవంబర్ 4: అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కూర సురేశ్, విజయారెడ్డి సజీవదహనం.

నవంబర్ 23: బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై కారు ప్రమాదం. ఫ్లై ఓవర్ నుంచి కిందికి పల్టీకొట్టిన కారు. ప్రమాదంలో మహిళ మృతి. మరో ఇద్దరికి గాయాలు.

నవంబర్ 26: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో బస్సు ప్రమాదం. స్కూటీని బస్సు ఢీకొట్టడంతో చనిపోయిన టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనా.

నవంబర్ 27: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్​ దిశ రేప్ అండ్​ మర్డర్​.

స్కూల్స్ మూసివేతపై గందరగోళం

స్టూడెంట్స్ తక్కువగా ఉన్న స్కూళ్లను రేషనలైజేషన్‍ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించడం చర్చనీయాంశమైంది. దీన్ని టీచర్‍ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఈమధ్య 50 మీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లను విలీనం చేస్తామనే విషయంపై తీవ్రంగా చర్చ సాగుతుంది. దీనిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు.

టెన్త్ రిజల్ట్ లో మెరిసిన స్టూడెంట్స్

గత ఏడాది హైదరాబాద్‍ జిల్లాలో 70,173 మంది టెన్త్ ఎగ్జామ్స్​  రాశారు. పాస్‍  పర్సెంటేజీ  83.09 శాతంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే 12 ఉత్తీర్ణత శాతం పెరిగింది. 25 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

డిసెంబర్ 6: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్. దిశ ఘటనలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి.

డిసెంబర్ 23: కడుపునొప్పితో చికిత్సకు వెళ్లిన యువతి వెన్నెముకలో బుల్లెట్​, ఆపరేషన్​ చేసి బయటకు తీసిన నిమ్స్ డాక్టర్లు. యువతి శరీరంలోకి ఆ బుల్లెట్ ఎలా వచ్చిందన్నది సస్సెన్స్​.

డిసెంబర్ 23: దిశ నిందితుల డెడ్ బాడీలకు ఎయిమ్స్ డాక్టర్లతో రీ పోస్ట్ మార్టం పూర్తి. కుటుంబ సభ్యులకు అప్పగింత.