సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.7.9 కోట్లు రికవరీ

సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.7.9 కోట్లు రికవరీ
  • సైబర్ నేరగాళ్లు కొట్టేసినడబ్బులు రికవరీ
  • లోక్​అదాలత్​లో రూ.7.9 కోట్లు తిరిగి ఇప్పించిన టీజీ సీఎస్​బీ

హైదరాబాద్, వెలుగు: సైబర్‌‌‌‌‌‌ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తెలంగాణ సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌‌‌‌బీ) అధికారులు తిరిగి ఇప్పిస్తున్నారు. ఈ నెల 8న నిర్వహించిన జాతీయ లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌లో ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా సైబర్‌‌‌‌ బాధితులకు రూ.7.9 కోట్లు రికవరీ చేసి ఇప్పించారు. తెలంగాణ ప్రభుత్వ లీగల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ అథారిటీ (టీజీ ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ), టీజీ సీఎస్‌‌‌‌బీ సంయుక్తంగా అన్ని జిల్లా, పోలీస్‌‌‌‌ కమిషనరేట్ల అధికారుల సమన్వయంతో జాతీయ లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌ విజయవంతమైనట్టు టీజీ సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

టీజీ సీఎస్‌‌‌‌బీలో మొత్తం 4,144 కేసులు నమోదు కాగా, ఇందులో జూన్‌‌‌‌ 8న నిర్వహించిన జాతీయ లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌లో 2,973 కేసుల్లో బాధితులకు రూ.7.9 కోట్లు తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన లోక్‌‌‌‌ అదాలత్‌‌‌‌లోనూ 803 కేసులు పరిష్కరించామని తెలిపారు. కాగా, సైబర్‌‌‌‌ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అపరిచిత వ్యక్తులు, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్‌‌‌‌కాల్స్‌‌‌‌, మెసేజ్‌‌‌‌లకు స్పందించొద్దని పేర్కొన్నారు. ఎలాంటి లింక్​లను క్లిక్ చేయొద్దని చెప్పారు. వ్యక్తిగత, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని తెలిపారు. సైబర్‌‌‌‌ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 టోల్‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఇలా చేయడంతో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి కాపాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని తెలిపారు.