లెక్క తేలాకే గోదావరి–కావేరి లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

లెక్క తేలాకే గోదావరి–కావేరి లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •      నీటి లెక్క తేల్చండి
  •     తర్వాతే గోదావరి–కావేరి లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ
  •     హైడ్రాలజీపై సమగ్ర స్టడీ అవసరమన్న ఏపీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గోదావరి నదిలో నీటి లభ్యత ఎంతనే విషయం ముందుగా తేల్చాలని, ఆ తర్వాతే గోదావరి–కావేరి లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదనపై ముందుకెళ్లాలని తెలంగాణ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ) 69వ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. తెలంగాణ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈఎన్సీ (జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ సమావేశంలో జలసౌధ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావేరి (ఇచ్చంపల్లి)–కృష్ణా (నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)–పెన్నా (సోమశిల)–గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆనికట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కావేరి) లింక్ పై సమావేశంలో చర్చించారు. ఈ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుపై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ సమర్పించిన డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైడ్రాలజీ అంశంలో తమకు అభ్యంతరాలున్నాయని తెలిపారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 247 టీఎంసీల నీటిని నదుల అనుసంధానంలో భాగంగా వినియోగించాలని ప్రతిపాదించారని, ఇక్కడ నదిలో 324 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టుగా పేర్కొన్నారని, దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి–కావేరి లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా తరలించే 247 టీఎంసీల్లో 70 టీఎంసీలు చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటా ఉందని గుర్తు చేశారు. ఇంద్రావతిపై తాము ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు మిగులు జలాలే ఉండవని గత సమావేశంలో ఆ రాష్ట్రం తేల్చిచెప్పిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గోదావరిలో 324 టీఎంసీల మిగులు జలాలు ఉంటాయన్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ స్టడీపై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపారు.  ముందు గోదావరిలో నీటి లభ్యత లెక్కలు తేల్చాలని, ఆ తర్వాతే గోదావరి–కావేరి లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపడితే మంచిదని సూచించారు.

ఇతర నదుల అనుసంధానంపై చర్చ
గోదావరి–కావేరి లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టు వీలైనంత త్వరగా చేపట్టాలని తమిళనాడు అధికారులు కోరగా, మిగులు జలాలు, ఇతర అంశాలపై మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు తమ అభ్యంతరాలను వివరించారు. ఈ సమావేశంలో కెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బెట్వా, దామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంగా–పింజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- పార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–తాపి, కోసి–మోచీ రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులపై చర్చించారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే కెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బెట్వా ప్రాజెక్టుకు ఇప్పటికే  కేంద్రం ఓకే చెప్పింది. రెండు రాష్ట్రాలు కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది.

ఒక్కో స్టడీలో ఒక్కోరకం రిపోర్టు
గోదావరిలో మిగులు జలాలపై ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూడీఏ నిర్వహించిన ఒక్కో స్టడీ ఒక్కో రకమైన రిపోర్ట్​ ఇచ్చిందని ఏపీ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. ముందు నీటి లభ్యతపై సమగ్ర స్టడీ అవసరమని, శాస్త్రీయంగా మిగులు జలాల లెక్క తేల్చాలని సూచించారు. గోదావరిలో తమది లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైపేరియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని, మిగులు జలాల వినియోగంపై తమకు హక్కులు ఉంటాయన్నారు. ఎగువ రాష్ట్రాలు వాడని వరదను తమ స్టేట్ లోకి వదులడం తో  పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని, తమ హక్కులు కాపాడాలని కోరారు. గోదావరి–కావేరి లిక్​కు ముందు తమ వాదనలను పరిగణలోకి తీస్కోవాలని కోరారు.