వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్

వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్
  • క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • పంట విస్తీర్ణంతో పాటు ఇతర అంశాలపై ఫోకస్ 
  • మహారాష్ట్ర, బెంగాల్​ తరహా శాటిలైట్​ సర్వేపైనా కసరత్తు

హైదరాబాద్ : వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పంటల సాగు వివరాలను లెక్కించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏ గ్రామంలో, ఏ క్లస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఏయే పంటలు ఎంతెంత విస్తీర్ణంలో సాగవుతున్నాయో లెక్కలు పక్కాగా తీయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయ శాఖ నిరుడు నుంచే గ్రామాల్లోని సర్వే నంబర్ల వారీగా పంటల నమోదు ప్రారంభించింది. ఈ యేడు సర్వే నంబర్ల వారీగా చేస్తూనే మరికొన్ని అంశాలను యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా విధి విధానాలను రూపొందించింది. వచ్చే వారం నుంచి క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో ఏఈవోలు రంగంలోకి దిగనున్నారు.

ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
పంటల నమోదు కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేసింది. ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఏఈవోలు గ్రామాల్లో పంట భూముల నుంచే నేరుగా ఏ సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏపంటను వేశారనేది నమోదు చేస్తారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారు. పంట ఏ దశలో ఉంది, దాని పరిస్థితి, చీడ పీడలు ప్రభావం, దిగుబడి అంచనా తదితర వివరాలను నమోదు చేస్తారు. పంట చీడ పీడల పరిస్థితిని అంచనా వేసి రైతులకు సూచనలు కూడా ఇవ్వనున్నారు.

శాటిలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వేకు కసరత్తు
ఇప్పటి వరకు పంట చివరి దశలో నమోదు జరుగుతోంది. ఫలితంగా ఎరువుల అవసరాలు, పంటలపై చీడ పీడలను కంట్రోల్ చేయడం, దిగుబడి అంచనాలపై స్పష్టత ఉండటం లేదు. ఈ నేపథ్యంలో  కొత్త టెక్నాలజీ వాడాలని సర్కారు భావిస్తోంది. క్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కాగా నమోదు చేసేందుకు శాటిలైట్ సర్వే చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు ఇప్పటికే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) సైంటిస్టులను సంప్రదించారు. పంటల నమోదు కోసం ఎన్ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ కొత్త టెక్నాలజీనీ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పత్తి, వరి, మక్క, కంది, పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. శాటిలైట్ సాయంతో ఎమర్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని వాడి పంటల నుంచి వచ్చే కాంతి కిరణాల ఆధారంగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైంది, పంట ఏ స్థాయిలో ఉంది, హార్వెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనా, దిగుబడి అంచనా వంటి అంశాలను పక్కాగా లెక్కించనున్నారు. 

వచ్చే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సర్వే 
మహారాష్ట్ర, బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల్లో ప్రతీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం నుంచే పంట సాగును శాటిలైట్ టెక్నాలజీని వాడి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్​ నుంచి రాష్ట్రంలోనూ మహారాష్ట్ర, బెంగాల్ తరహా పంట నమోదు విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.