సెప్టెంబర్ రెండో వారంలో టెట్..వచ్చే నెల ఫస్ట్ వీక్​లో నోటిఫికేషన్ రిలీజ్​

సెప్టెంబర్  రెండో వారంలో టెట్..వచ్చే నెల ఫస్ట్ వీక్​లో నోటిఫికేషన్ రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ను సెప్టెంబర్​ లో నిర్వహించాలని సర్కా రు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్, పరీక్ష నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు ఫస్ట్ వీక్​లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, 45 రోజుల తర్వాత సెప్టెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడు సార్లు టెట్ నిర్వహించారు. 2016, మే 22న తొలిసారి, 2017, జులై13న రెండోసారి పెట్టారు. గతేడాది జూన్ 12న చివరి సారి టెట్ నిర్వహించారు. ఈ నెల మొదటివారంలో ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో విద్యాశాఖ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైన.. వెంటనే టెట్ నిర్వహించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో టెట్ నిర్వహణపై అధికారులు సర్కారుకు నివేదిక అందించారు. దీనికి సర్కారు కూడా ఓకే అన్నట్టు తెలిసింది. 

టెట్ తర్వాత టీఆర్టీ!  

రెండు, మూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్  రానుండ టంతో కొన్ని పోస్టులతోనైనా టీఆర్టీ వేయాలనే ఆలో చనలో సర్కారు ఉంది. దీంతో టెట్ పూర్తయిన వెంటనే నాలుగైదు వేల పోస్టులతో టీఆర్టీ నోటిఫికేషన్ వేసే చాన్స్ కూడా ఉంది.