కాన్షి యువ సర్కార్..బీఎస్పీ మేనిఫెస్టో అంశాలివే

కాన్షి యువ సర్కార్..బీఎస్పీ మేనిఫెస్టో అంశాలివే

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ మేనిఫెస్టో విడుదలైంది. ఇప్పటికే 20 మందిని ప్రకటించిన బీఎస్పీ..అక్టోబర్ 17వ తేదీన మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాన్షీ యువ సర్కారు పేరిట విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో యువత,పేదలు, రైతుల కోసం పలు పథకాలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. 


కాన్షీ యువ సర్కార్ బీఎస్పీ మేనిఫెస్టో అంశాలు..

  • బహుజన రైతు బీమా..
  • ప్రతీ పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు..
  • రైతులకు పంట వేసినప్పటి నుంచి..అమ్మకం వరకు ప్రభుత్వ రాయితీ..
  • ధరణి పోర్టల్ రద్దు..
  • దొడ్డి కొమురయ్య భూమి హక్కు పథకం..
  • భూమిలేని ప్రతీ పేదకుటుంబానికి ఎకరం భూమి..
  • ఈ ఎకరం భూమి మహిళల పేరిట పట్టా
  • చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి
  • మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్లు, 
  • మహిళలకు స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ శిక్షణ
  • అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ
  • భీమ్ రక్షా కేంద్రాలు..
  • వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్యం
  • రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు
  • పూలే విద్యా దీవెన
  • తెలంగాణలో ప్రతీ మండలానికి ఇంటర్నేషన్ స్కూల్, 
  • ప్రతీ మండలం నుంచి ఏటా వంద విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య
  • డేటా ఏఐ, కోడింగ్ లో విద్యార్థులకు శిక్షణ
  • యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
  • 10 లక్షల ఉద్యోగాల్లో మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు
  • షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు
  • బ్లూ జాబ్ కార్డు పథకం..
  • గ్రామాలు, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ 
  • రోజూ కూలీ రూ. 350కు పెంపు
  • ఉపాధి కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్యం, జీవిత బీమా
  • షేక్ బందగీ గృహ భరోసా
  • ఇండ్లు లేని వారికి 550 ఇంటి స్థలం
  • ఇండ్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షల సాయం
  • ఇంటి పునర్నిణానికి రూ. 1.50 లక్షల సాయం
  • నూరేళ్ల ఆరోగ్య ధీమా
  • తెలంగాణలోని ప్రతీ కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య భీమా
  • ఏటా రూ. 25 వేల కోట్లతో పౌష్ఠికాహార పథకం
  • వలస కార్మికుల సంక్షేమ నిధి
  • రూ. 5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు
  • వలస కార్మికులకు వసతి
  • గిగ్ కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు