Telangana Elections 2023 Live updates : పోలింగ్ లైవ్ అప్ డేట్స్

 Telangana Elections 2023 Live updates  : పోలింగ్ లైవ్ అప్ డేట్స్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది.  మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదయ్యింది.  గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు  పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేస్తున్నారు ప్రజలు.

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 114 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తైంది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్‌ జిల్లాలో అత్యధికంగా 80.28శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు ఎన్నికల పోలింగ్‌ సమయంలోపు క్యూలైన్‌లో నిలబడిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. 

సాయంత్రం 4 గంటల వరకు మాత్రం తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగింది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా జిల్లాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని చోట్ల మాత్రం క్యూలైన్లలో ఓటర్లు ఉండడంతో వారికి అవకాశం ఇచ్చారు. ఓటు వేసే చాన్స్ ఇస్తున్నారు అధికారులు.

డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు

తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబరు 3వ తేదీన ప్రకటించనున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం 5.30 నిమిషాల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. 

  • డిసెంబర్ 3న రాబోయే ఎన్నికల ఫలితం వందలాది త్యాగధనుల ఆశయ సాధనలో తొలి అడుగు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రేవంత్ ట్వీట్

  • శ్రీకాంతచారి తెలంగాణ కోసం అగ్నికణమై మండిన రోజు నవంబర్ 29… అమరుడైన రోజు డిసెంబర్ 3
  • డిసెంబర్ 3న రాబోయే ఎన్నికల ఫలితం వందలాది త్యాగధనుల ఆశయ సాధనలో తొలి అడుగు.
వరంగల్ లో లాఠీ  చార్జీ
  • వరంగల్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ వద్ద యువకులపై లాఠీ చార్జీ
  •  ఇద్దరు యువకుల తలకు తీవ్ర గాయాలు
 
  • తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదు.
  • అత్యధికంగా మెదక్ లో 69 శాతం పోలింగ్
  • అత్యల్పంగా హైదరాబాద్లో 31.17 శాతం  నమోదు

మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా జిల్లాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి.

మరోవైపు.. తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల  వరకు సుమారు 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 70.48శాతం పోలింగ్‌ నమోదు కాగా..  అత్యల్పంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 20.09 శాతం నమోదైంది. 

 
 

ఆలేరులో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే భర్త కారుపై రాళ్ల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా  ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.  బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్తుండగా మహేందర్ రెడ్డిని అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి చేశారు. మహేందర్ రెడ్డి కారు ధ్వంసం అయ్యింది.  కేంద్రబలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టాయి.

  • మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్  వర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం కిష్టాపురం పోలింగ్ బూత్ లోకి వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్గీయులు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పరం తోపులాటకు జరగడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు.

 

  • గులాబీ కండువా కప్పుకుని ఓటు వేసి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎలక్షన్ అధికారి ఫిర్యాదుతో ఇంద్రకరణ్ రెడ్డిపై  నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.

 

హైదరాబాద్ లో ఖాళీగా దర్శనమిస్తున్న పోలింగ్ కేంద్రాలు

తెలంగాణలో పోలింగ్ మందకొండిగా  జరుగుతోంది.  మధ్యాహ్నం 1 గంటల వరకు 36 .68 శాతం పోలింగ్ నమోదయ్యింది.  రూరల్ ఏరియాలో  పోలింగ్ ఎక్కువగా నమోదు కాగా.. పట్టణ ప్రాంతాల్లో  తక్కువగా నమోదవుతోంది.  అతి తక్కువగా  హైదరాబాద్ లో 21 శాతం మాత్రమే పోలింగ్ నమోదయ్యింది.  పోలింగ్ పర్సంటేజ్ పెంచడంపై ఈసీ ఫోకస్ పెట్టిన ప్రయోజనం లేదు.   మల్కాజ్ గిరిలో 26.70 శాతం,  రంగారెడ్డిలో 29.79 శాతం నమోదయ్యింది.

  • హస్తం సునామీ దెబ్బకు కారు గ్యారేజ్ కి వెళ్లబోతోంది. ఇది తెలంగాణ ప్రజల ఛైతన్యం కు ప్రతీక అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో కామెంట్ చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా 36.68 శాతం పోలింగ్ నమోదు

  • తెలంగాణ సీఎం కేసీఆర్ చింతమడకు చేరుకున్నారు. చింతమడకలో కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.   


  • తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా  కొనసాగుతుంది.  రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు 20.64 పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు . అత్యధికంగా  అదిలాబాద్ లో 30. 65 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్‌లో 12.39 శాతం నమోదైంది.  మధ్యాహ్నం తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఈసీ భావిస్తోంది.

  • హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు పవన్ కల్యాణ్  

  • రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని బూత్ నంబర్ 248లో ఓటు వేయడానికి క్యూలో నిలబడిన బండ్ల గణేష్

  •  

  • సిద్దిపేటలోని భరత్ నగర్ లోని అంబీటస్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు

  • కరీంనగర్ సాధన స్కూల్ పోలింగ్ సెంటర్ లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న బండి సంజయ్. 

  •  

  • ములుగులో సొంతూరు జగన్నపేటలో ఓటేసిన సీతక్క
  •  బోధన్ లోని శక్కర్ నగర్ లో బూత్ నెం. 89 లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్
  •  ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌
     
  • రంగారెడ్డి జిల్లాలో పోలింగ్‌ శాతం

    ఇబ్రహీంపట్నం: 8.11శాతం
    ఎల్బీనగర్‌: 5.6శాతం
    మహేశ్వరం: 5శాతం
    రాజేంద్రనగర్‌: 15శాతం
    శేరిలింగంపల్లి: 8శాతం
    చేవెళ్ల (ఎస్సీ): 5శాతం
    కల్వకుర్తి: 5శాతం
    షాద్‌నగర్‌: 7.2శాతం

  • ఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

  • శేరిలింగంపల్లి కొండాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

 

  • కొల్లాపూర్ స్వతంత్ర్య అభ్యర్థి కర్నె శిరష ( బర్రెలక్క) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఆమె ఓటు వేశారు.  హైకోర్టు ఆదేశాలతో ఆమె బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రానికి వచ్చారు.  

  •  

  • కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు  మంత్రి మల్లారెడ్డి..

  • బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు  

  • ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు తేజ, నటుడు వెంకటేష్‌, రాఘవేంద్రరావు

  •  

  • పోలింగ్ బూత్ లలోకి సెల్ ఫోన్లను అనుమతించని అధికారులు. ఇబ్బంది పడుతున్న ఓటర్లు

  • హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి దంపతులు, కుమార్తె శ్రీజ

  • తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను.  :  మోదీ

  • ఎన్నికల కోడ్ ఉల్లఘించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ..  పార్టీ  కండువాతో పోలింగ్ బూత్ లోకి వెళ్లిన  ఇంద్రకరణ్ రెడ్డి 

  • జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని 117వ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు.  

  • అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

  • మహబూబాబాద్ జిల్లా బయ్యారం హైస్కూల్ లో 33  పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మోరాయించింది.  
  • నిర్మల్ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన ఎల్లపెల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. 
  •  
  • నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం పెరకపల్లె గ్రామంలోని 145 పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం...  పరిశీలిస్తున్న అధికారులు.
  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 
  • మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు.  బంజారాహిల్స్ నందినగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఓటు వేశారు. 

  •  జూబ్లీహిల్స్ లో  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కీరవాణి, సుమంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని సుమంత్ అన్నారు.  హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెరగకపోవడం బాధకరమని చెప్పారు.  

  • హీరో  ఎన్టీఆర్‌ కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో ఓటు వేశారు.