కాంగ్రెస్​లో చేరిన పరిగి బీఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్​లో చేరిన పరిగి బీఆర్ఎస్ నేతలు

పరిగి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతుందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పరిగి అభ్యర్థి టి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మాజీ వైస్ ఎంపీపీ మాణిక్యం, కుల్కచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, దోమ ఎంపీపీ అనసూయ, సత్యనారాయణతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పరిగిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.