8మంది అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చిన పవన్ కళ్యాణ్

8మంది అభ్యర్థులకు బీఫామ్ లు ఇచ్చిన పవన్  కళ్యాణ్

తెలంగాణలో మొదటిసారి జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు విషయంలో పలుసార్లు ఇరు పార్టీల అధ్యక్షులు భేటీ అయి చర్చించారు. అనంతరం  పొత్తులో భాగంగా తెలంగాణలో జనసేనకు 8 స్థానాలకు కేటాయించింది బీజేపీ. దీంతో  తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన.. రాష్ట్రంలోని  ఎనిమిది నియెజకవర్గాల్లో పోటీకి దిగుతోంది.

 ఇప్పటికే ఆ నియెజకవర్గాల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థులను జనసేన ప్రకటించింది. 2023, నవంబర్ 8వ తేదీ బుధవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో తమ అభ్యర్థులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీ ఫామ్ లను అందజేశారు.

తెలంగాణలో జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలు:

  • ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌: కూకట్‌పల్లి
  • వంగల లక్ష్మణ్ గౌడ్‌: నాగర్‌ కర్నూల్‌
  • మిర్యాల రామకృష్ణ: ఖమ్మం
  •  లక్కినేని సురేందర్‌రావు: కొత్తగూడెం
  • డా.తేజావత్‌ సంపత్‌ నాయక్‌: వైరా(ఎస్టీ)
  •  ముయబోయిన ఉమాదేవి: అశ్వారావుపేట(ఎస్టీ)
  • కోదాడ- మేకల సతీష్‌రెడ్డి: కోదాడ
  • నేమూరి శంకర్‌గౌడ్‌: తాండూరు