ఆన్ లైన్ లో కరెంట్ బిల్లు కడుతున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు మోసపోవచ్చు..

ఆన్ లైన్ లో కరెంట్ బిల్లు కడుతున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు మోసపోవచ్చు..

బిల్లులు వెంటనే చెల్లించకుంటే విద్యుత్‌ను నిలిపివేస్తామని బెదిరించి ప్రజలను మోసం చేసే సైబర్​ నేరగాళ్ల బారిన పడొద్దని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్​ఎస్​పీడీసీఎల్) ప్రజలను హెచ్చరించింది. 

సైబర్​ నేరగాళ్లు కొత్తగా ఆన్​లైన్​లో కరెంటు బిల్లులు చెల్లించే వారిని టార్గెట్​చేసుకున్నారని.. వారు మెసేజ్​ల రూపంలో తాము విద్యుతు ఆఫీస్​ నుంచి అని పరిచయం చేసుకుంటూ..  మీరు కరెంటు బిల్లు కట్టలేదు.. ఈ నంబర్ కి వెంటనే బిల్లు పే చేయండి అంటూ ఓ గుర్తు తెలియని నంబర్​ని పంపుతున్నారు. 

సైబర్​ నేరగాళ్లు పంపిన నంబర్ కి ఫోన్​ చేస్తే వాళ్లు ఓ యాప్​ ఇన్​స్టాల్​ చేసుకోమని చెబుతారు. అడిగిన విధంగా వివరాలివ్వగానే ఇంటర్నెట్​ బ్యాంకింగ్, క్రెడిట్​ కార్డు వివరాలను తస్కరిస్తారు. వివిధ పద్ధతుల ద్వారా బ్యాంక్​ అకౌంట్లోని అమౌంట్ మొత్తం విత్​డ్రా చేస్తారు. 

ఇలా సరికొత్త మోసానికి సైబర్​ నేరగాళ్లు తెరతీశారని అధికారులు చెబుతున్నారు. టీఎస్ ఎస్ పీడీసీఎల్​ బిల్లు చెల్లింపుల కోసం ఎలాంటి వెబ్​సైట్​ లింకులను విద్యుత్తు శాఖ ఎప్పుడూ పంపదని.. అలాంటి వారిని నమ్మవద్దని సూచిస్తున్నారు. బ్యాంక్​ డీటెయిల్స్, ఓటీపీ తదితర వివరాలు ఎవరితో షేర్​ చేసుకోవద్దని వెల్లడించారు. బాధితులెవరైనా మోసపోయామని గుర్తిస్తే వెంటనే1930 నంబర్ కి ఫోన్​ చేసి కంప్లెంట్​ చేయాలని చెప్పారు.