ఎల్ఆర్ఎస్ గడువు మరో 3 రోజులు పెంపు

ఎల్ఆర్ఎస్ గడువు మరో 3 రోజులు పెంపు

హైదరాబాద్, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్( ఎల్ఆర్ఎస్) గడువును మరో 3 రోజులు పొడిగిస్తూ  మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి మోమో జారీ చేశారు. 25 శాతం రాయితీతో ఈ నెల 3 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 25 లక్షల వరకు అప్లికేషన్లు రాగా.. ఇప్పటి వరకు 5 లక్షల మందిలోపే ఫీజు చెల్లించారు. రూ. 2 వేల కోట్లలోపే ఫీజు వసూలు అయింది. ప్రభుత్వం మాత్రం రూ. 10 వేల కోట్లు వసూలు అవుతుందని అంచనా వేసింది.