ఆగస్టు 14 నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు

ఆగస్టు 14 నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు

ఆగస్టు 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నగదును జమ చేయనుంది. ఆగస్టు 14వ తేదీ (సోమవారం) 1 లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
 
మరో పక్షం రోజుల్లో రూ.లక్ష ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల త్వరలో చేయబోతున్న మంత్రి హరీష్ రావు ప్రకటించారు.  మొత్తంగా నెల లోపు తెలంగాణ ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయనుందని వెల్లడించారు. లక్ష రూపాయల పైన తీసుకున్న రుణాలను మరో 15 నుంచి 20 రోజుల్లో మాఫీ చేస్తామని స్పష్టం చేశారు.  ఆగస్టు 12వ తేదీ శనివారం సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. సంగారెడ్డిలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.