ఈ బాలుడు ఎవరు ?

ఈ బాలుడు ఎవరు ?

తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఓ బాలుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంత చిన్న వయసులోనే అలా మాట్లాడడం చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ వీడియోను వీక్షించారు. ఈ పిల్లోడికి ఉన్న తెలివి మన ప్రతిపక్ష నాయకులకు లేకపాయే.. అని ఒకరు చేసిన పోస్ట్ ను జత చేస్తూ ఈ వీడియోలోని బాలుడు ఎవరు  అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆ బాలుడు ఏం మాట్లాడాడు అనే విషయానికొస్తే...

అందరికీ నమస్కారం. నా పేరు ప్రజా ఉజ్వల్. ఎందరో చేసిన పోరాటం... మరికొందరి బలిదానం ఫలితమే నవ తెలంగాణ రాష్ట్రం. జూన్2, 2014 తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారమైన రోజు ఇది. 58ఏళ్ల వివక్షకు తెరపడిన రోజు. చరిత్రల సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మన తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు అని ప్రారంభించిన ఆ బాలుని వీడియో ప్రస్తుతం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, కేసీఆర్ పోరాట పటిమ, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన విధానాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్పే ఈ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరిన్ని వార్తల కోసం..

పేరు మార్చుకున్న దేశం

ఉక్రెయిన్‌‌లో 20 శాతం రష్యా ఆధీనంలో