
హైదరాబాద్, వెలుగు: గ్యాంగ్‌స్టర్ నయీంకు సంబంధించి ఏపీ, తెలంగాణలో 10 బినామీ ఆస్తులను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. వాటి విలువ రూ.150 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. కోర్టు ఆదేశాలతో వాటిని అటాచ్ చేసింది. దీనికి సంబంధించిన నోటీసులను నయీం బినామీలకు అందించింది. మహ్మద్ హసీనా బేగం, పాశం శ్రీనివాస్, అబ్దుల్ ఫహీం, అబ్దుల్ నజీర్, శ్రీనివాస్‌లను బినామీలుగా గుర్తించింది. 2016 ఆగస్టు 8న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్కౌంటర్ చేశారు. అప్పటి నుంచి నయీం ఆస్తులపై విచారణ కొనసాగుతుంది.