
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ గోల్ఫర్ జమాల్ హుస్సేన్ విజేతగా నిలిచాడు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్ జీ ఏ)లో శుక్రవారం జరగాల్సిన ఫైనల్ రౌండ్ భారీ వర్షం కారణంగా రద్దయింది.
మూడు రౌండ్ల (54 హోల్స్) స్కోర్ల ఆధారంగా ఫలితాలు ప్రకటించగా.. 23 -అండర్ 187 స్కోర్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్న జమాల్ టైటిల్ నెగ్గాడు. ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. చండీగఢ్‌కు చెందిన అక్షయ్ శర్మ రన్నరప్‌గా నిలవగా.. హైదరాబాద్ గోల్ఫర్ విశేష్ శర్మ 22వ స్థానం సాధించాడు. టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు విన్నర్‌కు ట్రోఫీ అందజేశారు.