తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది.  వేం నరేందర్ రెడ్డి,  షబ్బీర్ ఆలీ, హర్కర వేణుగోపాల్ లను సలహాదారులుగా నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వలు జారీ చేశారు. ఇటు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియమితులయ్యారు.  నలుగురికి స్టేట్ మినిస్టర్ ర్యాంకు తో కూడిన ప్రోటోకాల్ ఉంటుంది.  

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియామకం
  •  ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీ శాఖలకు సలహాదారుగా షబ్బీర్ అలీ
  • రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా  మల్లు రవి
  • ప్రోటోకాల్,ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావు నియామకం

అసెంబ్లీ  ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి  మహబూబాబాద్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు.   ఇక షబ్బీర్ ఆలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సలహాదారుల నియామకాలను  రద్దు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సలహాదారులుగా నియమితులైన సోమేశ్‌కుమార్‌, చెన్నమనేని రమేష్‌, రాజీవ్‌ శర్మ, అనురాగ్‌ శర్మ, ఏకే ఖాన్‌, జీఆర్‌ రెడ్డి, ఆర్‌.శోభ నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది.