
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) కోసం జిల్లాల వారీగా స్కిల్డ్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 879 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వర్క్ ఇన్స్పెక్టర్ పోస్టులు 532, ఎటక్ట్రీషియన్ 109, ఫిట్టర్ 50, ఆపరేటర్స్ 167, ల్యాబ్ అటెండెంట్ 10, వైర్ లెస్ ఆపరేటర్ పోస్టులు 11 జిల్లాల వారికి కేటాయించారు. అన్ని కేటగిరీల్లో కలిపి ఆదిలాబాద్ జిల్లాకు 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 37, జగిత్యాలకు 36, జనగామకు 24, జయశంకర్ భూపాలపల్లికి 26, జోగులాంబ గద్వాలకు 21, కామారెడ్డికి 24, కరీంనగర్ కు 32, ఖమ్ముంకు 39, కుమ్రంభీం అసిఫాబాద్ కు 22, మహబూబాబాద్ కు 23, మహబూబ్ నగర్ కు 21, మంచిర్యాలకు 24, మెదక్ కు 17, ములుగుకు 12, నాగర్ కర్నూల్ కు 21, నల్గొండకు 64, నారాయణపేటకు 23, నిర్మల్ కు 20, నిజామాబాద్‌కు 40, పెద్దపల్లికి 50, రాజన్న సిరిసిల్లకు 23, రంగారెడ్డికి 27, సంగారెడ్డికి 25, సిద్దిపేటకు 49, సూర్యాపేటకు 27, వికారాబాద్‌కు 26, వనపర్తికి 16, వరంగల్ అర్బన్‌కు 13, వరంగల్ కు 30, యాదాద్రి భువనగిరికి 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు ఒక పోస్టు మంజూరు చేశారు.
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ ప్రోటోకాల్ కోసం ప్రత్యకంగా వింగ్ ఏర్పాటు చేశారు. స్కిల్డ్ పోస్టులతో పాటు అన్ స్కిల్డ్ కేటగిరి లష్కర్ లు, ఇతర కింద స్థాయి సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయబోతున్నారు.