42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం

42 శాతం బీసీ రిజర్వేషన్ల  కోసం సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం

 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. 

 ఈ మేరకు  సీఎం రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింగ్వి తదితరులు జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. హైకోర్టు స్థానిక సంస్థలు ఎన్నికల నోటిఫికేషన్, జీవో 9 మీద స్టే ఇవ్వడంపై  తదుపరి చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. జీవో 9 ని అమలు చేసేందుకు సుప్రీం కోర్ట్ తలుపు తట్టాలని నిర్ణయానికి వచ్చారు. 

  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ అన్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యం గా మందుకెళ్తోంది.బీసీలకు రిజర్వేషన్లు విషయం తేల్చే వరకు స్థానిక ఎన్నికలకు వెళ్లబోమని ఇప్పటికే మంత్రలు చెప్పారు.

50 శాతం మించకుండా ఎన్నికలు

మరో వైపు సుప్రీం తీర్పు ప్రకారం పాతపద్దతిలో అంటే..  మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా  స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. జీవో 9 పై మాత్రమే స్టే ఇచ్చిందని..రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది.  మరోవైపు వచ్చే వారంలో క్యేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.